అమిత్ షాతో రామ్మోహన్ నాయుడు భేటీ
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కళింగపట్నం తీర ప్రాంతంలో కోత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.