టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో సవ్యసాచి స్పిన్నర్
సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరగనున్న రెండో టెస్టుపై టీమిండియా దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఇందులో స్పిన్నర్ కౌశిక్ మైతీ భారత బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. బెంగాల్‌కు చెందిన కౌశిక్ రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు. ఓ బంతిని కుడిచేతితో, మరో బంతిని ఎడమ చేతితో బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను పరీక్షించాడు.