VIDEO: శానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం

పాత గుంటూరులోని పలు ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యే నసీర్ పరిశీలించారు. శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.