సాంగ్వి గ్రామంలో పర్యటించిన డిపిఓ
NRML: దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో డిపిఓ శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. ముందుగా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సెగ్రిగేషన్, నర్సరీలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామంలో వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రపరచాలని, తడి పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. ఎంపీఓ గోవర్ధన్ తదితరులు ఉన్నారు.