'కొత్తగూడెంను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి'

BDK: జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలు వినియోగంపై పోలీసులు గస్తీ నిర్వహించాలని సూచించారు.