ఓటర్‌లతో ముచ్చటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఓటర్‌లతో ముచ్చటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

NLG: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిప్పర్తి ZPHS పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. అనంతరం ఆమె ఓటర్లతో ముఖాముఖంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి పేపర్లు, వాటర్ బాటిల్‌ను  తీసుకెళ్లకూడదని సూచించారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.