'CMRF పేదలకు వరం'
ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే సతీమణి కందుల వసంతలక్ష్మి మండల పరిధిలోని పలువురికి మంజూరైన CMRF చెక్కులను శుక్రవారం అందజేశారు. 8 మందికి రూ. 3,44,105 లక్షల చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. CMRF పేదలపాలిట వరమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆమె గ్రామంలోని చిన్నారులతో ఆప్యాయంగా పలకరించారు.