సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
JN: పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అర్హులైన లబ్ధిదారులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజలకు వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.