గృహ గ్యాస్ దుర్వినియోగంపై కట్టడి చర్యలు
GNTR: వాణిజ్య వినియోగానికి గృహ LPG సిలిండర్లను ఉపయోగిస్తున్న వారిపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు చేపట్టారు. నెహ్రూ నగర్, శారద కాలనీల్లో తనిఖీలు జరిపి 6 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యవసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లు వెల్లడించారు. నగరంలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.