ఛలో విజయవాడ కార్యక్రమానికి ఫ్యాప్టో పిలుపు

ఛలో విజయవాడ కార్యక్రమానికి ఫ్యాప్టో పిలుపు

KRNL: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న నిర్వహించే “చలో విజయవాడ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్యాప్టో నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఆదోనిలో నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ మాట్లాడుతూ.. ఐఆర్, పీఆర్‌సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, తదితర 17 డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు.