ఎడ్లపాడులో క్వారీ కుంటలో విద్యార్థి గల్లంతు
PLD: ఎడ్లపాడు మండలం చౌడవరంలో ఉన్న క్వారీ కుంటలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకార.. మంగళవారం 9 మంది విద్యార్థులు సరదాగా ఈత కొట్టడానికి లోతైన ఈ కుంటలోకి దిగారు. వీరిలో 8 మంది సురక్షితంగా బయటకు రాగా, ఒక విద్యార్థి మాత్రం గల్లంతయ్యాడు. ఎస్సై శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.