సీఐఐ సదస్సులో డ్రమ్స్ వాయించిన మంత్రి
SS: విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను బీసీ సంక్షేమ, చేనేత శాఖల మంత్రి సవిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన గురవయ్య బృందG సభ్యులతో కలిసి సవిత ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.