సైనికులు క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ పూజలు

HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండవ వార్డులోని శివాలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సంక్షేమార్దం ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో బార్డర్‌లో సైనికులు క్షేమంగా ప్రత్యర్థుల దాడులు తిప్పికొట్టాలని ప్రత్యేక పూజలు చేశారు.