పారిశుద్ధ్య సిబ్బందికి టోపీలు అందజేసిన నగర మేయర్

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయంలో నేడు పారిశుద్ధ్య సిబ్బందికి టోపీలను నగర మేయర్ గుండు సుధారాణి పంపిణీ చేశారు. వేసవి ఎండలు మండిపోతుండడంతో పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కల్పించడం కోసం టోపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డాక్టర్ రాజారెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.