ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు

NZB: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భారీ వర్షాల నేపథ్యంలో భీంగల్ పట్టణంలోని ఒకటో వార్డు అయ్యప్ప నగర్ నుంచి రథాం చెరువుకు వెళ్లే కాల్వను JCBతో శుభ్రం చేయించినట్లు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా అయ్యప్ప నగర్ కాలనీలో నీళ్లు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు ఉన్నారు.