'వైద్యుల సూచనలను పాటించాలి'
MNCL: గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకొని వైద్యుల సలహాలు పాటించాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ సూచించారు. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గర్భిణీలు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.