VIDEO: తుపాను హెచ్చరిక.. తీరం వైపు వాయుగుండం
VSP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేద్రం ప్రకటించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం విశాఖకు 880 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని.. సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.