ట్రాన్స్ జండర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేత

ప్రకాశం: ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ట్రాన్స్ జండర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలని పేర్కొన్నారు. ముగ్గురికి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన పాల్గొన్నారు.