ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

BHNG: పోచంపల్లి మండలం జలల్పూర్–పోచంపల్లి, రేవనపల్లి, శివారెడ్డి గూడెం, అలీ నగర్, జూలూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.