ఏడుగురు ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి
ATP: జిల్లా ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. జిల్లా ఎస్పీ పి.జగదీష్ వీరికి పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో ఆరుగురు 2000 బ్యాచ్, ఒకరు 2009 బ్యాచ్‌కు చెందిన వారున్నారు. ఈ సందర్భంగా వీరంతా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.