పెళ్లి వేడుకలో విషాదం.. యువకుడు మృతి
SDPT: జిల్లాలో విషాద ఘటన జరిగింది. KNR జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన జంగపల్లి రాజు (28) ఇవాళ హుస్నాబాద్‌లో బంధువుల వివాహానికి వచ్చాడు. ఈక్రమంలో వ్యక్తిగత పనిపై బైక్‌పై బయటకు వెళ్లి నాగారం రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి డ్రైనేజీ కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.