నేడు ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCS) సమావేశం కానుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. యుద్ధం ముదురుతున్న వేళ భారత వ్యూహాలు, ప్రవాసుల భద్రతపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.