VIDEO: బురదలో ఇరుక్కుపోయిన ఏనుగు
CTR: యాదమరి మండలంలోని 12 కంపల్లి డీకే చెరువు సమీపంలో శనివారం రాత్రి మేత కోసం వచ్చిన ఒంటరి ఏనుగు చెరువులోకి దిగడంతో బురదలో ఇరుక్కుపోయింది. ఈ విషయం ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరి గమనించి పై అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే యాదమరి ఎస్సై ఈశ్వర్ యాదవ్, ఎస్.ఎస్. మోహన్, డీఆర్ఓ లోకేష్, రెస్క్యూ టీంలు చేరుకున్నాయి