క్యూ2 ఫలితాలు.. ఎయిర్‌టెల్ లాభం డబుల్
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి గానూ రూ.8,651 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.4,153.4 కోట్లుగా ఉంది. అంటే రెట్టింపు లాభాన్ని నమోదు చేసింది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.233 నుంచి రూ.256కు పెరిగింది.