VIDEO: సమస్యలపై వినూత్న నిరసన
KDP: బద్వేల్ మున్సిపాలిటీ 8వ వార్డులోని ప్రజలు, చిన్నారులు కలిసి వినూత్న నిరసన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని 'లోకేష్, పవన్ సార్.. డ్రైనేజీ ఎక్కడ.? రోడ్లు ఎక్కడ.?' అంటూ ప్రశ్నించారు. ప్రాంతంలో మౌలిక వసతుల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.