చెరువుల రిపేర్లకు రూ.1.11 కోట్లు మంజూరు

NLR: ఉదయగిరి ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలోని గండిపాలెం జలాశయం, పలు చెరువుల రిపేర్లకు రూ.1.11 కోట్లు మంజూరైనట్లు డీఈ చంద్రమౌళి తెలిపారు. గండిపాలెం జలాశయం పరిధిలో 14 పనులకు రూ.79 లక్షలు, ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో పది చెరువుల మరమ్మతులకు రూ.32 లక్షలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు చేయించారన్నారు.