నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు: ఎంపీ

MDCL: నిరుద్యోగ పోరాట నాయకుడు అశోక్ సెప్టెంబర్ 15న ఆమరణ నిరాహార దీక్ష చేయనున్న నేపథ్యంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎంపీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.