ఆదిత్యని సేవలో ఎమ్మెల్యే

ఆదిత్యని సేవలో ఎమ్మెల్యే

శ్రీకాకుళంలోని అరసవిల్లిలో కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామిని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఎమ్మెల్యే దంపతులను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.