గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి

కృష్ణా: గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విజయవాడ నుండి వైజాగ్ వెళ్తున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి గన్నవరంలో వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ బ్యానర్లు చూసి ఫోటోలు తీస్తుండగా వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగడంతో ఘర్షణ మొదలైంది. టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.