ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..!
NDL: శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని తిరిగి వెళ్తుండగా మార్కాపురం జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అరటికాయల లోడు లారీ-జీపు జిల్లాలోని తిప్పాయపాలెం వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.