ప్రభాస్ లుక్ లీక్.. స్పందించిన నిర్మాణ సంస్థ

ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా "ఫౌజి" నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను అధికారికంగా త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా 1940ల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామాగా తెలుస్తోంది.