హాస్టల్ బాలికలకు ఉచిత వైద్య శిబిరం

BPT: చీరాల వుడ్ నగర్‌లో ఉన్న బీసీ బాలికల వసతి గృహం ఆనంద నిలయం నందున్న ఎనభై మంది బాలికలకు హృద్రోగ వైద్య నిపుణులు ఐ.బాబూరావు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శుచిగా, శుభ్రంగా ఉండాలని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.