'జీఎంసీ కార్మికులు, ఉద్యోగులు గ్రీవెన్స్ వినియోగించుకోండి'

'జీఎంసీ కార్మికులు, ఉద్యోగులు గ్రీవెన్స్ వినియోగించుకోండి'

GNTR: జీఎంసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతీ నెలా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సమస్యలపై నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత ఫిర్యాదులపై విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు.