రోడ్డు ప్రమాదం.. చిన్నారి జీవితం అంధకారం
MLG: తాడ్వాయి మండలం సమీపంలో జరిగిన ఆటో ప్రమాదంలో మిల్కీ (3) తీవ్రంగా గాయపడి చూపు కోల్పోయింది. ఆదివారం తల్లి రజితతో ప్రయాణిస్తుండగా ఆటో పల్టీ కొట్టింది. ములుగు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం, అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో చిన్నారి స్పృహలోకి వచ్చినప్పటికీ చూపుకోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఇటీవల తన తండ్రి మృతితో కుటుంబం విషాదంలో ఉంది.