మహానందిలో పోయిన ఉంగరం లభ్యం

మహానందిలో పోయిన ఉంగరం లభ్యం

NDL: మహానందీశ్వర స్వామి దర్శనానికి బెస్తవారిపేటకు చెందిన నాగరాజు మహానందికి వచ్చారు. పుణ్యస్నానం కోసం కోనేరులోకి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత తన మూడు గ్రాముల బంగారు ఉంగరం కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. హోంగార్డు నాయక్‌కు సమాచారం ఇచ్చారు. పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో ఉంగరాన్ని గుర్తించి ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి ద్వారా ఆయనకు అందజేశారు.