'కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడిగితే తులం బంగారం ఏదని అడగండి'
BDK: BRS పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి కోరారు. రామాంజనేయ కాలనీ, రుద్రంపూర్,గ్రామపంచాయతీలో ఇవాళ ప్రచారం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే తులం బంగారం ఏదని అడగాలని సూచించారు.