మహిళపై వేధింపులు.. ఇద్దరిపై కేసు నమోదు: ఎస్సై
NZB: ఓ వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తనను వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయిల్ గంగాధర్, కొండా అమర్ అనే వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ వెంటపడుతూ, వేధిస్తున్నారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని NZB 4వ టౌన్ SI కె.శ్రీకాంత్ మంగళవారం తెలిపారు.