డ్రైవర్లకు అవగాహన కల్పించిన సీఐ
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో సర్కిల్ పోలీస్ స్టేషన్‌లకు చెందిన హెవీ, ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాల డ్రైవర్లకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం సీఐ రాజగోపాల్ రోడ్డు భద్రత, సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు.