VIDEO: కాకాణి ఇంటి ముందు సంబరాలు

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈక్రమంలో నెల్లూరులోని ఆయన ఇంటి వద్ద సోమవారం రాత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. "Boss Is Back” అంటూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచుకుంటూ విక్టరీ సింబల్ చూపారు. ఇవాళ కాకాణి జైలు నుంచి విడుదల కానున్నారు.