VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

MHBD: కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరీష్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాలలోని కిచెన్ షెడ్, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించి పారిశుద్ధ్యంపై దిశానిర్దేశం చేశారు. ఆహార ప్రమాణాల విషయంలో ఎటువంటి అలసత్వం వహించరాదని హెచ్చరించారు.