ఫేక్ సర్టిఫికెట్లతో జాబ్..!
TPT: APSPDCLలో నకిలీ ITI ధ్రువపత్రాలతో ఉద్యోగాల్లో చేరిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాలని CMD శివశంకర్ లోతేటి ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు సహా పలు జిల్లాల్లో జరిగిన విచారణలో ఈ అనర్హ నియామకాలు బయటపడ్డాయి. చిత్తూరు నుంచి నలుగురు, తిరుపతి నుంచి ముగ్గురు ఫేక్ సర్టిఫికేట్లతో విధుల్లో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు.