గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన
ASR: అరకు శుక్రవారం వారపు సంతలో ధరలు పడిపోవడంతో బస్తా కాలీఫ్లవర్ వంద రూపాయలకు వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాయకష్టం చేసి పండించిన పంటకు పెట్టుబడి డబ్బు కూడా రావడం లేదని అవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.