శ్రీమద్భగవద్గీతపై విద్యార్థులకు పోటీలు
కడప: పట్టణంలోని మున్సిపల్ స్టేడియం సమీపం వద్ద గల శ్రీ సాయి దత్త మందిరంలో ఆదివారం శ్రీమద్భగవద్గీత, భక్తి యోగంపై విద్యార్థిని, విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సిద్ధవటం ఏఎస్ఐ సుబ్బరామచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.