యూరియా కోసం రైతుల అవస్థలు

MBNR: జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని యూరియా సరఫరా కేంద్రం వద్దే పడుకున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి షాప్ ముందు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాకు యూరియా రావడంతో తమకు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.