'పారాక్వాట్ గడ్డి మందు విక్రయిస్తే కఠిన చర్యలు'

'పారాక్వాట్ గడ్డి మందు విక్రయిస్తే కఠిన చర్యలు'

MHBD: పారాక్వాట్ గడ్డి మందు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి సరిత హెచ్చరించారు. బయ్యారం మండలంలోని పలు పురుగుమందులు, ఎరువుల దుకాణాలతో పాటు కంబాలపల్లి సొసైటీ వద్ద ఉన్న ఎరువుల విక్రయ కేంద్రాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ విధానాన్ని సమీక్షించారు.కార్యక్రమంలో ఏవో రాజు పాల్గొన్నారు.