శివమల్లన్న ఆలయంలో కలెక్టర్ పూజలు
ASF: కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, దీపాలు వెలిగించారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే స్వామి వారిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలకిసేవ, జ్వాలా తోరణంలో పాల్గొన్నారు.