లింగమయ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింగమయ్య స్వామిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి అనురాధ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల గుండె ఆపరేషన్ అనంతరం కోలుకొని మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు.