VIDEO: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తి అరెస్ట్
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద శనివారం మద్యం మత్తులో ఆర్టీసీ బస్సును ఆపి హల్ చల్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నారాయణరెడ్డిగారిపల్లె వద్ద మద్యం మత్తులో రాయచోటికి రావడం కోసం బస్సులు ఆపకపోవడం వల్ల అతను ఆటోలో రాయచోటికి చేరుకొని బంగ్లా సర్కిల్లో బస్సులపై వీరంగం సృష్టించాడని పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు CI తెలిపారు.