సూర్యాపేట ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్‌లు వీరే!
సూర్యాపేట పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా మొరిశెట్టి నివేదిత, వైస్ ఛైర్మన్‌గా మహమ్మద్ షఫీ ఉల్లా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌కు చెందిన 31 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో వీరి ఎన్నిక లాంఛనమైంది. దీంతో మున్సిపాలిటీపై హస్తం పార్టీ పట్టు బిగించినట్లయింది.