సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల సెగ

సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల సెగ

SRPT: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో సూర్యాపేటలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్లకు ఈ నెల 30 వరకే గడువు ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్లు ఖరారు కాకపోవడంతో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే, మరోవైపు రెబల్స్ భయం ప్రధాన పార్టీలను వెంటాడుతోంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.